VicksWeb upgrade Location upload ads trending
VicksWeb భారతదేశం
నేడు ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి
Source:  Vaartha
Friday, 18 January 2019 10:00

NTR
NTR

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామారావు 23వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్ తెల్లవారుజామునే వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా తెలుగువారంతా ముందుకు సాగాలన్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ అని బాలయ్య కొనియాడారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు
Source:  Vaartha
Friday, 18 January 2019 09:53

jobs
jobs

హైదరాబాద్‌: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత 2018-2019లో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ సంస్థ ఆధ్వర్యంలో పలు కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ జిల్లా సర్వీస్‌ కో ఆపరేటివ్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్‌ ఫోన్‌, ఎల్‌ఈడీ, హోం థియేటర్‌ టీవీ, ఎయిర్‌ కండీషనర్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టూల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ సర్టిఫికెట్‌ కోర్సులో శిక్షణ ఇస్తామని వారు పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని, విద్యార్హతలను బట్టి వారికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఆధార్‌, ఆదాయ, స్టడీ జీరాక్స్‌ ప్రతులతో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

నేడు కడపలో పర్యటించనున్న హోంమంత్రి
Source:  Vaartha
Friday, 18 January 2019 09:48

 

Rajnath singh
Rajnath singh

కడప: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు నగరంలోని  కందుల మైదానానికి చేరుకుంటారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి 4.55 గంటలకు కడప విమానాశ్రయం వెళ్లి, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

సీబీఐ నుండి రాకేశ్‌ అస్థానా బదిలీ
Source:  Vaartha
Friday, 18 January 2019 09:43

 

rakesh asthana
rakesh asthana

న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక సంచాలకుడు రాకేశ్‌ అస్థానాకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనతో పాటు మరో ముగ్గురు సీనియర్‌ అధికారులనూ గురువారం ఉన్నఫళంగా బయటకు పంపింది. అస్థానాతో పాటు సంయుక్త సంచాలకుడు అరుణ్‌కుమార్‌ శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, ఎస్పీ జయంత్‌ జె నాయక్‌నవరేల పదవీ కాలాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు సిబ్బంది శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అస్థానాను పౌర విమానయాన భద్రతా సంస్థ బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాల భద్రతను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. అయితే, మిగతా ముగ్గురు అధికారులను ఎక్కడకు పంపుతారన్న వివరాలను వెల్లడించలేదు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
Source:  Vaartha
Friday, 18 January 2019 09:37

Australia
Australia

మెల్‌బోర్న్‌: భారత్‌తో జరుగుతున్న ఆఖరు వన్డేలో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం కారణంగా ఆట కాసేపు నిలిచిపోయింది. వర్షం తెరిపినివ్వడంతో ఆసీస్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది. అయితే 3వ ఓవర్లో భువనేశ్వర్‌ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న ఓపెనర్‌ అలెక్స్‌ కారె(5) కోహ్లీ చేతికి చిక్కి ఔటయ్యాడు. అతడి స్థానంలో ఖవాజా క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో ఫించ్‌(3) ఉన్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ స్కోరు 8/1.

Related Images:

[See image gallery at www.vaartha.com]

ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌
Source:  Vaartha
Friday, 18 January 2019 09:35

KOHILI
KOHILI

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వన్డే సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి మ్యాచ్‌ కావడంతో ఘన విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. మరోవైపు వన్డే సిరీస్‌నైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతోంది.

Related Images:

[See image gallery at www.vaartha.com]

నేటి నుండి ఏపిలో ఎస్జీటీ పరీక్షలు
Source:  Vaartha
Friday, 18 January 2019 09:28

online exam
online exam

అమరావతి: ఏపీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), స్పెషల్‌ స్కూల్‌ టీచర్లకు సంబంధించిన డీఎస్సీ2018 పరీక్షలు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ఎస్జీటీ 8 రోజులపాటు, స్పెషల్‌ స్కూల్‌ టీచర్‌ పరీక్షలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇవి శుక్రవారం నుంచి ప్రారంభమై ఈ నెల 31 వరకు జరుగుతాయి. 123 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సంధ్యారాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 3,45,114 మంది ఎస్జీటీ, 866 మంది స్పెషల్‌ టీచర్ల పరీక్షలను రాయబోతున్నారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం
Source:  Vaartha
Friday, 18 January 2019 09:24

POCHARAM
POCHARAM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. ఈ పదవికి సీఎం ఆయనను ఎంపిక చేయగా.. గురువారం మధ్యాహ్నం శాసనసభలో నామినేషన్‌ దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత గడువులోగా ఆయన ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. సీఎం కేసీఆర్‌ వినతి మేరకు కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎంలు ఆయనకు మద్దతు తెలిపాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభాపతిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపడతారు. ఈరోజు తరువాత

Related Images:

[See image gallery at www.vaartha.com]

తెలంగాణ జర్నలిస్టులను ఆహ్వానించిన నవ్యాంధ్రప్రదేశ్‌ జర్నలిస్టులు
Source:  Vaartha
Friday, 18 January 2019 01:13

welcome
సైఫాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యూజెఎఫ్‌) 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 28,29 తేదీలలో తిరుపతిలో జరుగుతున్న నేపధ్యంలో ఫెడరేషన్‌, నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(ఎన్‌ఎజె) నాయకులు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టియుడబ్ల్యూజెఎఫ్‌)ను ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌ నగరంలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌, ఎన్‌ఎజె నాయకులు ఆకుల అమరయ్య, ఎన్‌.కోండయ్య తదితరులు టియుడబ్ల్యూజెఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందంను తమ మహాసభలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెండు ఫెడరేషన్‌ల నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఫెడరేషన్‌ కార్యకలాపాలు, పరిస్ధితులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రదానంగా రెండు రాష్ట్రాలలో జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల సమస్య, జాతీఈయ వ్యవహారాలు తదితర అంశాలపై గంటసేపు చర్చించడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టుల సమస్యలపై త్వరలో హైదరాబాద్‌ నగరంలో జాతీయ స్ధాయి సమావేశాన్ని నిర్వహింస్తామని వారు తెలిపారు.


సత్యనారాయణగౌడ్‌ ప్యానల్‌ను గెలిపించాలి:రవీందర్‌రెడ్డి
Source:  Vaartha
Friday, 18 January 2019 01:12


సైఫాబాద్‌, జనవరి 17 ప్రభాతవార్త: ఎపిఎన్‌జివొఎస్‌ (గచ్ఛిభౌలి) మ్యూచువల్లి ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సోసైటి డైరెక్టర్స్‌కు ఈ నెల 19వ తేదీన జరగనున్న ఎన్నికల నేపధ్యంలో భాగ్యనగర్‌ టిఎన్‌జివొఎస్‌ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్‌ ప్యానల్‌ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని టిఎన్‌జివోఎస్‌ ఛైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్యానల్‌కు ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధుల మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. మూడు దశాబ్ధాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల కోసం సోసైటికి 190 ఎకరాల భూమిని కేటాయించిందని, ఇందులో 90 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, ఉన్న వంద ఎకరాల భూమిని కాపాడుకుని సోసైటిలోని సభ్యులందరికి ఇళ్ళ స్ధలాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్యానల్‌లోని డైరెక్టర్లు విజయం సాధిస్తే ప్రభుత్వంతో పోరాడి ఇళ్ళ స్ధలాలను సాధించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. సంఘం సెక్రటరీ జనరల్‌ మమత మాట్లాడుతూ సోసైటిలోని సభ్యులు ఒక్కొక్కరూ ఇప్పటికే లక్షన్నర రూపాయలు చెల్లించడం జరిగిందని ఇంత వరకు ఇళ్ళ స్ధలాలు రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్యానల్‌ విజయం సాధిస్తే సభ్యులందరికి ఇళ్ళ స్ధలాలు వస్తాయని ఆమె భరోసా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు సత్యనారాయణగౌడ్‌, రేచల్‌, లక్ష్మణ్‌, రాజేందర్‌, డైరెక్టర్‌ పోస్టులకు పోటి చేస్తున్న అభ్యర్ధులు 15 మంది పాల్గొన్నారు. అనంతరం ప్యానల్‌ అభ్యర్థులతో ఉన్న వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.


<< < Prev 1 2 3 Next > >>